ఎందఱో మహానుభావులు
ప . ఎందరో మహానుభావులందరికి వందనము అ . చంద్ర వదనునియంద చందమును హృదయారవిందమున జూచి బ్రహ్మానందమనుభవించు వా ( రెందరో ) చ 1. సామ గాన లోల మనసిజ లావణ్య ధన్య మూర్ధన్యు ( లెందరో ) చ 2. మానస వన చర వర సంచారము సలిపి మూర్తి బాగుగ పొడగనే వా ( రెందరో ) చ 3. సరగున పాదములకు స్వాంతమను సరోజమును సమర్పణము సేయు వా ( రెందరో ) చ 4. పతిత పావనుడనే పరాత్పరుని గురించి పరమార్థమగు నిజ మార్గముతోను పాడుచును సల్లాపముతో స్వర లయాది రాగములు తెలియు వా ( రెందరో ) చ 5. హరి గుణ...