కంటి శుక్రవారము గడియలేడింట
కంటి శుక్రవారము గడియ లేడింట - అంటి అలమేల్మంగ అండనుండే స్వామిని ॥ సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోణముగట్టి - కమ్మని కదంబము కప్పు పన్నీరు చెమ్మతోన వేష్టువలు రొమ్ముతల మొలచుట్టి - తుమ్మెద మైచాయతోన నెమ్మది నుండే స్వామిని ॥ కంటి !! పచ్చకప్పూరమె నూఱి పసిడి గిన్నెల నించి - తెచ్చి శిరసాదిగ దిగ నలది అచ్చెరపడి చూడ అందరి కన్నులకింపై - నిచ్చెమల్లెపూవు వలె ఇటుతానుండే స్వామిని ॥ కంటి !! తట్టు పునుగే కూరిచి చట్టలు చేరిచినిప్పు - పట్టి కరగించి వెండి పళ్ళాల నించి దట్టముగ మేనునిండ పట్టించి దిద్ది - బిట్టు వేడుక మురియుచుండే బిత్తరి స్వామిని ॥ కంటి ! !