Posts

Showing posts with the label నౌకాచరిత్ర౦

మాకులమునకిహ పరమొసగిన నీకు

ప. మా కులమునకిహ పరమొసగిన నీకు మంగళం శుభ మంగళం అ. మాకుల బ్రోచిన మదన జనక నీకు మంగళం శుభ మంగళం (మా) చ 1. మద గజ గమన మానిత సద్-గుణ నీకు మంగళం శుభ మంగళం మద మోహ రహిత మంజుళ రూప ధర నీకు మంగళం శుభ మంగళం (మా) చ 2. మనసిజ వైరి మానస సదన నీకు మంగళం శుభ మంగళం మనవిని విని మమ్మేలుకొన్న నీకు మంగళం శుభ మంగళం (మా) చ 3. మా మనసున నెలకొన్న కృష్ణ నీకు మంగళం శుభ మంగళం మా మనోహర పాలిత త్యాగరాజ నీకు మంగళం శుభ మంగళం (మా)

ఘుమ ఘుమ ఘుమయని వాసనతో

ప. ఘుమ ఘుమ ఘుమయని వాసనతో ముద్దు గుమ్మలు వెడలిరి చూడరే అ. మమతతోను సుర వరులెల్ల సుర తరు సుమ వానలు కురియింపగ వేడ్కగ (ఘు) చ 1. నలు-వంక పగలు వత్తులు తేజరిల్లగ చెలగ సాంబ్రాణి పొగలు గ్రమ్మ గంధ పొడుల చల్లుచు పయ్యెదల తీయుచు పన్నీరులు చిలుకుచు యదు కుల వీరునితో (ఘు) చ 2. బంగారు చీరలు రంగైన రవికలు- నుంగరములు వెలయంగ సొగసుగా భుజంగ శయనుడగు రంగ పతిని జూచి పొంగుచు తనివార కౌగిలించుచును (ఘు) చ 3. వరమైన కనక నూపురములు ఘల్లన- యురమున ముత్యాల సరులెల్ల కదలగ కరమున సొగసైన విరి సురటులచే విసరుచు త్యాగరాజ వరదుని పొగడుచు (ఘు)

హరి హరి నీయొక్క దివ్య పాదారవిందమియ్యవే

ప. హరి హరి నీయొక్క దివ్య పాదారవిందమియ్యవే అ. ధరను కలుగు భోగ భాగ్యమెల్లను తథ్యము కాదు సుమీ శ్రీ కృష్ణా (హ) చ 1. సనక సనందన శ్రీ నారద శుకార్జున ఘనులెల్ల నుతించు వనజ నయన బ్రహ్మాది సంక్రందనలనయము సేవించు (హ) చ 2. విను వేద పురాణాగమ శాస్త్ర విద్యలందు చరించు ఘన సమ నీల నిరంజన నిర్గుణ కనికరముగ త్యాగరాజు భావించు (హరి)

వేదవాక్యమని యెంచిరి యీ

ప. వేద వాక్యమనియెంచిరియీ వెలదులెల్ల సమ్మతించిరి చ 1. చీరలన్నియు వదలించిరియెంతో సిగ్గు చేతనందునుంచిరి (వేద) చ 2. అందున నిలువక పోయెను మేను- లందరికి తడువనాయెను (వేద) చ 3. కనుకొందురోయని సరగున పాలిండ్ల కరముల మూయ మరుగునా (వేద) చ 4. మానములను మూసుకొందురో తమ ప్రాణములను కాచుకొందురో (వేద) చ 5. చెలుల నోరెండగనాయెను నీరు చిలు చిలుమనియెక్కువాయెను (వేద) చ 6. వల్వలు కానక పోయెను సతుల వదనములటు స్రుక్కనాయెను (వేద) చ 7. కరగి కరగియంగలార్చిరి చెలులు కమలాక్షునురమున జేర్చిరి (వేద) చ 8. కనుల కాటుక నీరు కారగా జూచి కాంతుడెంతో ముద్దు కారగ (వేద) చ 9. రమణుల మదమెల్ల జరిగెను త్యాగ- రాజ నుతుని మది కరగెను (వేద)

ఇందుకేమి సేతుమమ్మ కృష్ణుడెంత మాటలాడెనమ్మ

ప. ఇందుకేమి సేతుమమ్మ కృష్ణుడెంత మాటలాడెనమ్మ అ. మగువలంటే ఇంత వాదా మాకు మానమే ప్రాణము కాదా (ఇ) చ 1. గుస-గుసలందేమి వచ్చు చెలుల ఉసురుంటే ఊరు పోవచ్చు (ఇ) చ 2. వనితల కనియెవరికైన కృష్ణా వంచనగా పల్క తగునా (ఇ) చ 3. హఠము సేయ వేళ కాదు ఆత్మ హత్య కాని వేరె లేదు (ఇ) చ 4. నగ్నముగా నిల్వ వశమా కృష్ణా నలుగురిలో నీకు యశమా (ఇ) చ 5. నా మాటలు విని మీరు వేగ నను గట్టు జేర్చ పోనీరు (ఇ) చ 6. లలనల పాపములేమో ఈలాగు వ్రాతలుండెనేమో (ఇ) చ 7. వెలకు తీసిన వలపు రాదు కాన వెలదులయిక నమ్మ రాదు (ఇ) చ 8. రాజన్య ఇటుయెంచ వలదు త్యాగరాజ వినుత ప్రేమ కలదు (ఇ)