Posts

Showing posts with the label అమృతవర్షిణి రాగ౦

అన్ని మ౦త్రములు

Image
                                  13. అన్ని మంత్రములు ఇందె ఆవహించెను - వెన్నతో నాకు గలిగె వేంకటేశు మంత్రము నారదుడు జపియించె నారాయణ మంత్రము - చేరె ప్రహ్లాదుడు నారసింహ మంత్రము కోరి విభీషణుడు చేకొనె రామ మంత్రము - వేరెనాకు గలిగె వేంకటేశు మంత్రము రంగగు వాసుదేవ మంత్రము ధృవుండు జపించె - అంగవించె కృష్ణ మంత్రము అర్జునుడు ముంగిట విష్ణు మంత్రము మొగిశుకుడు పఠించె - వింగడమై నాకు నబ్బె వేంకటేశు మంత్రము ఇన్ని మంత్రముల కెల్ల ఇందిరనాథుడె గుఱి - పన్నిన దిదియే పరబ్రహ్మ మంత్రము నన్ను గావగలిగేబో నాకు గురుడియ్యగాను - వెన్నెల వంటిది శ్రీవేంకటేశు మంత్రము