Posts

Showing posts with the label శ్రీరామదాసు కీర్తన

దినమే సుదినము సీతారామ స్మరణే పావనము

Image
ప: దినమే సుదినము సీతారామ స్మరణే పావనము || దినమే || చ 1: ప్రీతినై నా ప్రాణభీతి నైనా కలిమి చేతనైనా మిమ్మే ఏతీరుగ తలచిన ఆ || దినమే || చ 2: అర్థాపేక్షను దినము వ్యర్ధముగాకుండ సార్ధకముగా మిమ్ము ప్రార్ధన చేసిన ఆ || దినమే || చ 3: నిరతము మెరుగు బంగారు పుష్పముల రఘు వరుని పదముల నమర పూజించిన ఆ || దినమే || చ 4: మృదంగ తాళము తంబురశృతి గూర్చి మృదు రాగము కీర్తన పాడినను విన్న ఆ || దినమే || చ 5: ఘనమైన భక్తిచే పెనగొని యే వేళ మనమున శ్రీరాముని చింతించిన ఆ || దినమే || చ 6: భక్తులతో ననురక్తిని గూడక భక్తి మీరగను భక్తవత్సలు పొగడగా || దినమే || చ 7: దీనశరణ్య మహానుభావ యోగానలోల నను కరుణింపుమని కొలుచు ఆ || దినమే || చ 8: వాసిగ శ్రీహరిదాసుల గూడుకొని వాసుదేవు వాంఛతోను పాడెడి ఆ || దినమే || చ 9: అక్కరతోడ భద్రాచలమునను చక్కని సీతారాములను చూచిన ఆ || దినమే ||

కంటి మా రాములను కనుగొంటి నేను

Image
                  ప: కంటి మా రాములను కనుగొంటి నేను || కంటి || చ 1: కంటి నేడు భక్త గణముల బ్రోచు మా యింటి వేలుపు భద్రగిరినున్న వాని || కంటి || చ 2: చెలు వొప్పుచున్నట్టి సీతా సమేతుడై కొలువు తీరిన మా కోదండరాముని || కంటి || చ 3: తరణికుల తిలకుని ఘన నీలగాత్రుని కరుణారసము కురియు కందోయి గలవాని || కంటి || చ 4: హు రు మంచి ముత్యాలసరములు మెరయగా మురిపెంపు చిరునవ్వు మోముగలిగిన వాని || కంటి || చ 5: ఘలు ఘల్లుమను పైడిగజ్జెలందెలు మ్రోయగ తళుకు బెళుకు పాదతలము గలిగిన వాని || కంటి || చ 6: కరకు బంగరు చేల కాంతి జగములు గప్ప శర చాపములు కేల ధరియించు స్వామిని || కంటి || చ 7: ధరణిపై శ్రీరామదాసు నేలెడు వాని పరమ పురుషుండైన భద్రగిరిస్వామిని || కంటి ||

శ్రీరాముల దివ్య నామ స్మరణ జేయుచున్న చాలు

Image
                    ప: శ్రీ రాముల దివ్యనామ స్మరణ జేయుచున్న జాలు ఘోరమైన తపములను గో ర నేటికే మనసా అ.ప: తారక శ్రీ రామ నామ ధ్యానము జేసిన జాలు వేరు వేరు దైవములను వెదుక నేటికే మనసా 1. భాగవతుల పాద జలము పైన చల్లుకొన్న జాలు భాగీరథికి పొయ్యేననే భ్రాంతియేటికే మనసా  భాగవతుల వాగమ్ర్తము పానము జేసిన జాలు బాగు మీరినట్టి అమ్ర్త పానమేటికె మనసా 2. పరుల హింస సేయకున్న పరమ ధర్మమంతే చాలు పరులను రక్శింతునని పల్కనేటికే మనసా దొరకని పరుల ధనము దోచకయుణ్డితే చాలు గురుతుగాను గోపురము గట్టనేటికె మనసా 3. పరగ దీనజనులయందు పక్శముంచినదే చాలు పరమాత్మునియందు బ్రీతి బెట్టనేటికే మనసా హరిదాసులకు పూజ లాచరించిను చాలు హరిని పూజసేతుననే యహ మ దేటికే మనసా 4. జప తపానుశ్ఠానములు సలిపిరి మూడులకై బుధులు జగదీషుని దివ్యనామ చింతన కోసరమై మనసా సఫలము లేక యే వేళ జిందించే మహాత్ములకు జప తపానుశ్ఠానములు సేయనేటికే మనసా 5. అతిథి వచ్చి యాకలన్న యన్న మింత ఇడిన జాలు క్రతువు సేయ వలయు ననే కాక్శయేటికే మనసా సతతము మా భద్రగిరి స్వామి రామదాస...

శ్రీరామ నామమే జిహ్వకు స్థిరమైయున్నది

Image
                                                          ప   శ్రీరామ నామమే జిహ్వకు స్థిరమై యున్నది       శ్రీరాముల కరుణయే లక్ష్మీకరమై యున్నది   చ 1) ఘోరమైన పాతకములు గొట్టేనన్నది మమ్ము       జేరకుండ నాపదలను చెండేనన్నది         || శ్రీరామ ||     2) దారి తెలియని యమదూతల తరిమేనన్నది         శ్రీమన్నారాయణ దాసులకు చెలువైయున్నది   || శ్రీరామ ||     3) మాయావాదుల పొందు మానుమన్నది -యీ         కాయ మస్థిరమని తలపోయుచున్నది         || శ్రీరామ ||     4) వదలని దుర్విషయ వాంచ వదలమన్నది -నా       మదిలో హరి భజన సంపత్కరమైయున్నది  ...

చరణములే నమ్మితి

Image
ప: చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి చ 1: వారధి గట్టిన వర భద్రాచల వరదా వరదా వరదా నీ దివ్య || చరణములే || చ 2: ఆదిశేష నన్నరమర చేయకు మయ్యా అయ్యా అయ్యా నీ దివ్య || చరణములే || చ 3: వనమున రాతిని వనితగ జేసిన చరణం చరణం చరణం నీ దివ్య || చరణములే || చ 4: పాదారవిందమే యాధారమని నేను పట్టితి పట్టితి పట్టితి నీ దివ్య || చరణములే || చ 5: వెయ్యారు విధముల కుయ్యాలించిన అయ్యా అయ్యా అయ్యా నీ దివ్య || చరణములే || చ 6: బాగుగ నన్నేలు భద్రాచల రామ దాసుడ దాసుడ దాసుడ నీ దివ్య || చరణములే ||