Posts

Showing posts with the label కాపీ రాగ౦

చరణములే నమ్మితి

Image
ప: చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి చ 1: వారధి గట్టిన వర భద్రాచల వరదా వరదా వరదా నీ దివ్య || చరణములే || చ 2: ఆదిశేష నన్నరమర చేయకు మయ్యా అయ్యా అయ్యా నీ దివ్య || చరణములే || చ 3: వనమున రాతిని వనితగ జేసిన చరణం చరణం చరణం నీ దివ్య || చరణములే || చ 4: పాదారవిందమే యాధారమని నేను పట్టితి పట్టితి పట్టితి నీ దివ్య || చరణములే || చ 5: వెయ్యారు విధముల కుయ్యాలించిన అయ్యా అయ్యా అయ్యా నీ దివ్య || చరణములే || చ 6: బాగుగ నన్నేలు భద్రాచల రామ దాసుడ దాసుడ దాసుడ నీ దివ్య || చరణములే ||

ఇంత సౌఖ్యమని నే జెప్పజాల

Image
                    ప. ఇంత సౌఖ్యమని నే జెప్ప జాల ఎంతో ఏమో ఎవరికి తెలుసునో అ. దాంత సీతా కాంత కరుణా స్వాంత ప్రేమాదులకే తెలుసును కాని (ఇ) చ. స్వర రాగ లయ సుధా రసమందు వర రామ నామమనే కండ చక్కెర మిశ్రము జేసి భుజించే శంకరునికి తెలుసును త్యాగరాజ వినుత (ఇ)

పావన రామ నామ

    ప: పావన రామ నామ సుధారస పానము జేసేదెన్నటికో సేవించియు శ్రీహరి పాదంబులు చిత్తమునుంచే దెన్నటికో || పావన రామ || చ1: దాసులగని సంతోషమ్మున తవ దాసోహమ్మను టెన్నటికో భూ సుతకుసు నతి ప్రాణప్రదంబగు పురుషోత్తము గనుటెన్నటికో || పావన రామ || చ2: చంచల గుణములు మాని సదా ని శ్చలమతి నుండేదెన్నటికో పంచ తత్వములు తారక నామము పఠియించుట నా కెన్నటికో || పావన రామ || చ3: ఇనవంశాంబుధి చంద్రుడు కృపతో ఇష్టము లొసగే దెన్నటికో కనకచేలు కరుణాలవాలుని కన్నుల జూచే దెన్నటికో || పావన రామ || చ4: వంచన లేకను భద్రాదీశుని వర్ణన చేసేదెన్నటికో అంచితముగ రామదాసుడనుకొని ఆనందించే దెన్నటికో || పావన రామ ||

మాధవా కేశవా

Image
12. మాధవ కేశవ మధుసూదన - విష్ణుశ్రీధరా పదనఖమ్ చింతయామి యూయమ్ .... వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న - రామరామ కృష్ణ నారాయణాచ్యుత దామోదరానిరుధ్ధ దైవ పుండరీకాక్ష - నామత్రయాధీశ నమోనమో... పురుషోత్త మ పుండరీకాక్ష - దివ్యహరి సంకర్షణ అధోక్షజ నరసింహ హృషీకేశ నగధర త్రివిక్రమ - శరణాగత రక్ష జయజయ సేవే... మగిత జనార్దన మత్స్యకూర్మ వరాహా - సహజ భార్గవ బుధ్ధ జయతురగ కల్కి విహిత విజ్ఞాన శ్రీవేంకటేశ శుభకరం - అహమిహ తవపద దాస్యం అనిశం భజామి