తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు
ప: తక్కువేమి మనకు రాముడు ఒక్కడుండు వరకు చ 1: ప్రక్క తోడుగా భగవంతుడు మన చక్రధారియై చెంతనె యుండగ || తక్కువేమి || చ 2: మ్రుచ్చు సోమకుని మును జంపిన యా మత్స్యమూర్తి మన పక్షము నుండగ || తక్కువేమి || చ 3: సురల కొరకు మందరగిరి మోసిన కూర్మావతారుని కృపమనకుండగ || తక్కువేమి || చ 4: దురాత్ముడౌ హిరణ్యాక్షు ద్రుంచిన వరాహమూర్తి మనవాడై యుండగ || తక్కువేమి || చ 5: హిరణ్యకశిపుని ఇరుచెక్కలుగా పరచిన నరహరి ప్రక్కన నుండగ || తక్కువేమి || చ 6: భూమి స్వర్గమును పొందుగ గొలిచిన వామనుండు మనవాడై యుండగ || తక్కువేమి || చ 7: ధరలో క్షత్రియులను దండించిన పరశురాముని దయ మనకుండగ || తక్కువేమి || చ 8: దశగ్రీవు మును దండించిన యా దశరథరాముని దయ మనకుండగ || తక్కువేమి || చ 9: ఇలలో యదుకులమున నుదయించిన బలరాముడు మన బలమై యుండగ || తక్కువేమి || చ 10: దుష్ట కంసుని ద్రుంచినట్టి శ్రీ కృష్ణుడు మనపై కృపతో నుండగ || తక్కువేమి || చ 11: కలియుగాంత్యమున కలిగిన దైవము కలికిమూర్తిమము గాచుచు నుండగ || తక్కువేమి || చ 12: నారాయణదాసుని గాచిన శ్రీమన్ నారాయణు నెర నమ్మియుండగ...