ననుబ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి
ననుబ్రోవమని చెప్పవే సీతమ్మతల్లి || ననుబ్రోవమని || ననుబ్రోవమని చెప్పవే నారీ శిరోమణి జనకుని కూతుర జనని జానకమ్మ || ననుబ్రోవమని || ప్రక్కను చేరి చెక్కిలి నొక్కుచు చక్కగ మరుకేళి చొక్కియుండెడివేళ || ననుబ్రోవమని || ఏకాంతరంగుడు శ్రీకాంత నినుగూడి ఏకాంతమున నేక శయ్య నున్నవేళ || ననుబ్రోవమని || అద్రిజ వినుతుడు భద్రగిరీశుడు నిద్రమేల్కొనువేళ నెలతరో బోధించి || ననుబ్రోవమని ||