Posts

Showing posts with the label లలిత రాగం

జయలక్ష్మి వరలక్ష్మి

Image
              జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికిఁ బెరసితివమ్మా పాలజలనిధిలోని పసనైనమీఁగడ మేలిమితామరలోని మించువాసన నీలవర్ణునురముపై నిండిననిధానమవై యేలేవు లోకములు మమ్మేలవమ్మా చందురుతోడఁ బుట్టిన సంపదలమెఱుఁగవో కందువ బ్రహ్మలఁ గాచేకల్పవల్లి అందినగోవిందునికి అండనే తోడునీడవై వుందానవు మాఇంటనే వుండవమ్మా పదియారువన్నెలతో బంగారుపతిమ చెదరనివేదములచిగురుఁబోడి యెదుట శ్రీవేంకటేశునిల్లాలవై నీవు నిదుల నిలిచేతల్లి నీవారమమ్మా