Posts

Showing posts with the label మధ్యమావతి రాగ౦

నగుమోము గలవాని

Image
              ప . నగు మోము గల వాని నా మనో - హరుని జగమేలు శూరుని జానకీ వరుని చ 1. దేవాది దేవుని దివ్య సుందరుని శ్రీ వాసు - దేవుని సీతా రాఘవుని ( న ) చ 2. సుజ్ఞాన నిధిని సోమ సూర్య లోచనుని అజ్ఞాన తమమును అణచు భాస్కరుని ( న ) చ 3. నిర్మలాకారుని నిఖిలాఘ హరుని ధర్మాది మోక్షంబు దయ చేయు ఘనుని ( న ) చ 4. బోధతో పలుమారు పూజించి నే - నారాధింతు శ్రీ త్యాగరాజ సన్నుతుని ( న )

వినాయకుని వలెను

Image
ప. వినాయకుని వలెను బ్రోవవే నిను వినా వేల్పులెవరమ్మా అ. అనాథ రక్షకి శ్రీ కామాక్షి సు-జనాఘ మోచని శంకరి జనని (వి) చ1. నరాధములకును వరాలొసగ- నుండ్రములై భూ-సురాది దేవతలు రాయిడిని జెంద రాదు దయ జూడ రాదా కాంచీ పురాది నాయకి (వి) చ2. పితామహుడు జన హితార్థమై నిన్ను తా తెలియ వేడ తాళిమి గల అవతారమెత్తియికను తామసము సేయ తాళ జాలము నతార్తి హారిణి (వి) చ3. పురాన దయచే గిరాలు మూకునికి రా జేసి బ్రోచు రాజ ధరి త్యాగరాజుని హృదయ సరోజమేలిన రామ సోదరి పరా శక్తి నను (వి)

అలకలల్లలాడగ

Image
                    ప . అలకలల్లలాడగ కనియా రాణ్మునియెటు పొంగెనో అ . చెలువు మీరగను మారీచుని మదమణచే వేళ ( అ ) చ . ముని కను సైగ తెలిసి శివ ధనువును విరిచే సమయ - మున త్యాగరాజ వినుతుని మోమున రంజిల్లు ( అ )

క్షీరాబ్ది కన్యకకు

Image
9. క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని నీరజాలయమునకు నీరాజనం జలజాక్షి మోమునకు జక్కవ కుచంబులకు నెలకొన్న కప్పురపు నీరాజనం అలివేణి తురుమునకు హస్తకమలంబులకు నిలువుమాణిక్యముల నీరాజనం చరణ కిసలయములకు సకియరంభోరులకు నిరతమగు ముత్తేల నీరాజనం అరిది జఘనంబునకు అతివనిజనాభికిని నిరతి నానావర్ణ నీరాజనం పగటు శ్రీవేంకటేశు పట్టపురాణియై నెగడు సతికళలకును నీరాజనం జగతి నలమేల్మంగ చక్కదనములకెల్ల నిగుడు నిజ శోభనపు నీరాజనం