Posts

Showing posts with the label సంజీవి రాగం

సకల జీవులకెల్ల సంజీవి యీమందు

Image
                       ప|| సకల జీవులకెల్ల సంజీవి యీమందు వెకలులై యిందరు సేవించరో యీమందు || చ|| మూడు లోకము లొక్కట ముంచి పెరిగినది | పోడిమి నల్లని కాంతి బొదలినది | పీడుక కొమ్ములు నాల్గు పెనచి చేయువారినది | వాడే శేషగిరిమీద నాటుకొన్న మందు || చ|| పడిగెలు వేయింటి పాము గాచుకున్నది | కడు వేదశాస్త్రముల గబ్బు వేసీది | యెడయక వొకకాంత యెక్కుక వుండినది | కడలేని యంజనాద్రి గారుడపు మందు || చ|| బలు శంఖు జక్రముల బదనికెలున్నది | తలచిన వారికెల్ల దత్త్వమైనది | అలరిన బ్రహ్మరుద్రాదుల బుట్టించినది | వెలుగు తోడుత శ్రీవేంకటాద్రి మందు ||