పల్లవి : మీనాక్షి మే ముదం దేహి మేచకాంగి రాజ మాతంగి అ . ప మాన మాతృ మేయే మాయే మరకతచ్ఛాయే శివ జాయే ( మధ్యమ కాల సాహిత్యం) మీన లోచని పాశ మోచని మానిని కదంబ వన వాసిని మధురా పురి నిలయే మణి వలయే మలయ ధ్వజ పాండ్య రాజ తనయే విధు విడంబన వదనే విజయే వీణా గాన దశ గమక క్రియే ( మధ్యమ కాల సాహిత్యం) మధు మద మోదిత హృదయే సదయే మహా దేవ సుందరేశ ప్రియే మధు ముర రిపు సోదరి శాతోదరి విధి గురు గుహ వశంకరి శంకరి సరిగమపదని – స్వరశాస్త్రవేత్తలు చెప్పిన పరంగా ఒక్కొక్క స్వరం ఒక్కొక్క దానినుంచి ఉత్పన్నమైంది. ‘స’ - షడ్జమం – ఇది నెమలి యొక్క కేకాధ్వని నుంచి పుట్టింది; ‘రి’ – రిషభం – వృషభ ధ్వనినుంచి పుట్టింది; చిట్టచివరి స్వరం ‘ని’ ఏనుగు ఘీంకారం నుంచి పుట్టింది. దాని స్థానం సహస్రారం. ఏనుగు ఘీంకారం సహస్రార స్థానం గనుక అది తన వదనంలో పెట్టుకొని ఆ ఘీంకారాన్ని వినిపిస్తాడు. మూలాధార స్థానం అంటే last benchలో కూర్చున్నవాడు అని కాదు అర్థం. సహస్రార స్థానంలో శివశక్తుల స్థానం మూలాధారానికి నేరుగా ప్రసరిస్తేనే అక్కడి నుంచి దాని ప్రయాణం ప్రారంభించి శరీరాన్నంతటినీ నడుపుతుంది గనుక మూలాధారం దగ్గర ఉన్నది పై ఆరు స్థానాల సారభ