Posts

Showing posts with the label శ్రీరంగం గోపాలరత్నం

నల్లని మేని నగవు చూపుల వాడు

Image
                   ప || నల్లని మేని నగవు చూపుల వాడు | తెల్లని కన్నుల దేవుడు || చ || బిరుసైన దనుజుల పింఛమణచినట్టి | తిరుపు కైదువ తోడి దేవుడు | సరిపడ్డ జగమెల్ల చక్క ఛాయకు దెచ్చి | తెరవు చూపినట్టి దేవుడు || చ || నీటగలసినట్టి నిండిన చదువులు | తేట పరచినట్టి దేవుడు | పాటిమాలినట్టి ప్రాణుల దురితపు | తీట రాసినట్టి దేవుడు || చ || గురుతువెట్టగరాని గుణముల నెలకొన్న | తిరువేంకటాద్రిపై దేవుడు | తిరముగ ధృవునికి దివ్యపదంబిచ్చి | తెరచి రాజన్నట్టి దేవుడు ||

సకలం హే సఖి

Image
                  సకలం హేసఖి జానామె తత్ ప్రకత విలాసం పరమం దధసే అలిక మౄగ మద మయ మషి కలనౌ జ్వలతాహే సఖి జానామే లలితం తవ పల్లవి తమనసి నిస్చలతర మేఘ శ్యామం దధసే చారుకపొల స్థల కరాంకిత విచారం హే సఖి జానామే నారయణ మహినాయక శయనం శ్రి రమనం తవ చిత్తే దధసే ఘన కుచ శైల క్రస్చిత విభుమని జననం హే సఖి జానామే కనతురస వేంకట గిరిపతి వినుత భొగ సుఖ విభవం దధసే..

అలమేలుమంగ నీ అభినవ రూపము

Image
           అలమేలుమంగనీ వభినవరూపము జలజాక్షు కన్నులకు చవులిచ్చేవమ్మ గరుడాచలాధీశు ఘనవక్షముననుండి పరమానంద సంభిరతవై నెరతనములు జూపి నిరంతరమునాథుని హరుషింపగ జేసి తిగదమ్మ శశికిరణములకు చలువలచూపులు విశదముగా మీద వెదజల్లుచు రసికత పెంపున కరగించి ఎప్పుడు నీ వశముజేసుకొంటి వల్లభునోయమ్మ రట్టడి శ్రీవేంకటరాయనికి నీవు పట్టపురాణివై పరగుచు వట్టిమాకులిగిరించు వలపుమాటలవిభు జట్టిగొని వురమునసతమైతివమ్మ