Posts

Showing posts with the label సురటి రాగ౦

శృంగారించుకొని వెడలిరి

Image
                                 ప. శృంగారించుకొని వెడలిరి శ్రీకృష్ణుని తోనూ అ. అంగ రంగ వైభోగముతో గోపాంగనా మణులెంతో సొగసుగ!!శృ౦గారి౦చుకొని!! 1. నవ్వుచు కులుకుచు నొకతె కొప్పున పువ్వుల ముడుచుచు నొకతె దువ్వుచు కురులను నొకతె కృష్ణుని రవ్వ జేయుచు నొకతె వేడ్కగ!!శృ౦గారి౦చుకొని!! 2. మగడు వీడనుచు నొకతె రవికయు బిగువున జేర్చుచు నొకతె తగును తనకనుచునొకతె పాద యుగముల నొత్తుచునొకతె వేడ్కగ!!శృ౦గారి౦చుకొని!! 3. సొక్కుచు సోలుచు నొకతె కృష్ణుని గ్రక్కున ముద్దిడునొకతె పక్కగు రమ్మనుచు నొకతె మడుపుల- నక్కర నొసగుచు నొకతె వేడ్కగ!!శృ౦గారి౦చుకొని!! 4. పరిమళములందుచు నొకతె శ్రీ హరి హరియనుచును నొకతె ఉరమున జేర్చుచు నొకతె పయ్యెద జరిపి వేడుకొనుచు నొకతె వేడ్కగ!!శృ౦గారి౦చుకొని!! 5. సారసాక్షయనుచు నొకతె కను సైగను పిలుచుచు నొకతె రారాయనుచును నొకతె త్యాగ- రాజ సఖుడనుచు నొకతె వేడ్కగ!!శృ౦గారి౦చుకొని!! ఏనోము నోచితిమో - పున్నాగ వరాళి ప. ఏ న...