Posts

Showing posts with the label ఖరహరప్రియ రాగ౦

చక్కని రాజ మార్గముయుండగ

Image
                                                                                              పల్లవి: చక్కని రాజ మార్గముయుండగ సందులదూరనేలే ఓ మనసా అనుపల్లవి: చిక్కని పాలు మీగడయుండగ చీయను గంగా సాగరమేలే చరణం: కంటికి సుందరతరమగు రూపమే ము క్కంటి నోట చెలగే నామమే త్యాగరా జింటనే బాగా నెలకొన్న దైవమే యిటు వంటి శ్రీసాకేతరాముని భక్తియనే

దిబ్బలు వెట్టుచు దేలినదిదివో

Image
                  ప || దిబ్బలు వెట్టుచు దేలిన దిదివో | ఉబ్బు నీటిపై నొక హంస || చ || అనువున గమల విహారమె నెలవై | ఒనరియున్న దిదె ఒక హంస | మనియెడి జీవుల మానస సరసుల | వునికి నున్న దిదె ఒక హంస || చ || పాలు నీరు నేర్పరచి పాలలో | నోలలాడె నిదె యొక హంస | పాలుపడిన యీ పరమహంసముల | ఓలి నున్న దిదె యొక హంస || చ || తడవి రోమరంధ్రంబుల గ్రుడ్ల | నుడుగక పొదిగీ నొక హంస | కడు వేడుక వేంకటగిరి మీదట | నొడలు పెంచెనిదె యొక హంస ||  

ఒకపరి కొకపరి

Image
                          ప. ఒకపరికొకపరి వయ్యారమై ముఖమున కళలెల్ల మొలసినట్లుండె 1. జగదేక పతి మేన చల్లిన కర్పూర ధూళి జిగిగొని నలువంక చిందగాను మొగి చంద్రముఖి నురమున నిలిపెగాన పొగరు వెన్నెల దిగిపోసినట్లుండె!!ఒకపరి!! 2. పొరి మెరుగు చెక్కుల పూసిన తట్టు పునుగు కరిగి యిరుదెసల కారగాను కరిగమన విభుడు గనుక మోహమదము తొరిగి సామజ సిరి తొలకి నట్లుండె!!ఒకపరి!! 3. మెరయ శ్రీవేంకటేశు మేన సింగారముగాను తరచైన సొమ్ములు ధరియించగా మెరుగు బోడీ అలమేలు మంగయు తాను మెరుపు మేఘము గూడి మెరసి నట్లుండె!!ఒకపరి!!

పక్కల నిలబడి

Image
     ప. పక్కల నిలబడి కొలిచే ముచ్చట బాగ తెల్ప రాదా అ. చుక్కల రాయని కేరు మోము గల సు-దతి సీతమ్మ సౌమిత్రి రామునికిరు (ప) చ. తనువుచే వందనమొనరించుచున్నారా చనువున నామ కీర్తన సేయుచున్నారా మనసున తలచి మై మరచియున్నారా నెనరుంచి త్యాగరాజునితో హరి హరి మీరిరు (ప)