Posts

Showing posts with the label బ్రహ్మోవత్సవములు

1. అదెవచ్చె నిదె వచ్చె

అదెవచ్చె నిదెవచ్చె అచ్యుతుసేనాపతి పదిదిక్కులకు నిట్టె పారరో యసురులు   గరుడధ్వజంబదె ఘనశంఖరవమదె సరుసనే విష్ణుదేవుచక్రమదె మురవైరిపంపులవె ముందరిసేనలవె పరచి గగ్గుల కాడై(ఱై) పారరో దానవులు తెల్లని గొడుగులవె దేవదుందుభులు నవె యెల్లదేవతరథా లింతటా నవె కెల్లురేగీ నిక్కి హరికీర్తి భుజములవె పల్లపు పాతాళానఁ బడరో దనుజులు వెండిపైడిగుదె లవె వెంజామరములవె మెండగు కైవారాలు మించిన వవె దండి శ్రీవేంకటపతి దాడిముట్టె నదెయిదె బడుబండై జజ్జరించి పారరో దైతేయులు

2. తిరువీధుల మెరసె

Image
                                                 ప. తిరువీధుల మెరసే దేవదేవుడు గరిమల మించిన సింగారముల తోడనూ!! 1. తిరుదండెలపైనేగి దేవుడిదే తొలినాడు సిరులా రెండవనాడు శేషుని మీద మిరిపెన మూడోనాడు ముత్యాలపందిరి క్రింద పోరి నాలుగోనాడు పూవు కోవెల లోను!! 2. గక్కన ఐదావనాడు గరుడుని మీద ఎక్కెను ఆరవనాడు ఏనుగు మీద చొక్కమై ఏడవనాడు సూర్య ప్రభలోనను యిక్కువ తేరును గుర్రమెనిమిదో నాడు!! 3. కనకపుటందలము కదసి తొమ్మిదోనాడు పెనచి పదోనాడు పెండ్లిపీట ఎనసి శ్రీవెంకటేశుడింతి అలమేల్మంగతో వనితల నడుమను వాహనాల మీదను!!