Posts

Showing posts with the label ఆదితాళ౦

నంద గోపాల ముకుంద

Image
                    ప. నంద గోపాల ముకుంద గోకుల నందన యమునా తీర విహార అ.ప.మందర గిరిధర మామవమాధవ మురళీధర మధుసూదన హరే చ. మందహాస వదన మంజుల చరణ అరవింద లోచన ఆశ్రిత రక్షణ పీతాంబర ధర పన్నగ శయన కలి కల్మష హరణ కరుణా పూరణ వందిత మునిబృంద గురు గుహానంద వైకుంఠ స్థితానంద కంద గోవర్ధనోద్ధార గోపస్త్రీ జార గోవింద

కంజ దళాయతాక్షి

Image
                          ప , కంజ దళాయతాక్షి కామాక్షి కమలా మనోహరి త్రిపుర సుందరి మధ్యమ కాల సాహిత్యం : కుంజర గమనే మణి మణ్డిత మంజుల చరణే మామవ శివ పంజర శుకి పంకజ ముఖి గురు గుహ రంజని దురిత భంజని నిరంజని చ . రాకా శశి వదనే సురదనే రక్షిత మదనే రత్న సదనే శ్రీ కాంచన వసనే సురసనే శృంగారాశ్రయ మంద హసనే మధ్యమ కాల సాహిత్యం ఏకానేకాక్షరి భువనేశ్వరి ఏకానందామృత ఝరి భాస్వరి ఏకాగ్ర మనోలయకరి శ్రీకరి ఏకామ్రేశ గృహేశ్వరి శంకరి

ఏనాటి నోము ఫలమో

Image
పల్లవి: ఏనాటి నోము ఫలమో ఏ దాన బలమో ॥ఏ॥ అను పల్లవి: శ్రీనాథ బ్రహ్మకైన నీదు సేవ దొరకునా తనకు గలిగెను ॥ ఏ॥చరణము(లు) నేను గోరిన కోర్కులెల్లను నేఁడు తనకు నెరవేరెను భానువంశతిలక నా పాలి భాగ్యమా సజ్జన యోగ్యమా ॥ఏ॥ నీదు దాపు నీదు ప్రాపు దొరికెను నిజముగా నే నీసొమ్మైతిని ఆది దేవ ప్రాణనాథ నా దంకమున పూజింప తన ॥కే॥ సుందరేశ సుగుణబృంద దశరథనంద నారవిందనయన పావన అందగాఁడ త్యాగరాజనుత సుఖమనుభవింప దొరకెరా భళీ తన ॥కే॥