ఆడమోడిగలదే రామయ్య మాట
ప. ఆడ మోడి గలదే రామయ్య మాట(లాడ) అ. తోడు నీడ నీవేయనుచును భక్తి కూడిన పాదము పట్టిన నాతో మాట(లాడ) చ. చదువులన్ని తెలిసి శంకరాంశుడై సదయుడాశుగ సంభవుడు మ్రొక్క కదలు తమ్ముని పల్క జేసితివి గాకను త్యాగరాజు ఆడిన మాట(లాడ)