Posts

Showing posts with the label ఆది తాళం

చక్కని రాజ మార్గముయుండగ

Image
                                                                                              పల్లవి: చక్కని రాజ మార్గముయుండగ సందులదూరనేలే ఓ మనసా అనుపల్లవి: చిక్కని పాలు మీగడయుండగ చీయను గంగా సాగరమేలే చరణం: కంటికి సుందరతరమగు రూపమే ము క్కంటి నోట చెలగే నామమే త్యాగరా జింటనే బాగా నెలకొన్న దైవమే యిటు వంటి శ్రీసాకేతరాముని భక్తియనే

చరణములే నమ్మితి

Image
ప: చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి చ 1: వారధి గట్టిన వర భద్రాచల వరదా వరదా వరదా నీ దివ్య || చరణములే || చ 2: ఆదిశేష నన్నరమర చేయకు మయ్యా అయ్యా అయ్యా నీ దివ్య || చరణములే || చ 3: వనమున రాతిని వనితగ జేసిన చరణం చరణం చరణం నీ దివ్య || చరణములే || చ 4: పాదారవిందమే యాధారమని నేను పట్టితి పట్టితి పట్టితి నీ దివ్య || చరణములే || చ 5: వెయ్యారు విధముల కుయ్యాలించిన అయ్యా అయ్యా అయ్యా నీ దివ్య || చరణములే || చ 6: బాగుగ నన్నేలు భద్రాచల రామ దాసుడ దాసుడ దాసుడ నీ దివ్య || చరణములే ||

మనసులోని మర్మమును

Image
                 ప. మనసు లోని మర్మమును తెలుసుకో మాన రక్షక మరకతాంగ నా (మనసు) అ. ఇన కులాప్త నీవే కాని వేరెవరు లేరు ఆనంద హృదయ (మనసు) చ. మునుపు ప్రేమ-గల దొరవై సదా చనువునేలినది గొప్ప కాదయ్య కనికరంబుతోనీ వేళ నా కరము పట్టు త్యాగరాజ వినుత (మనసు)

తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు

Image
          ప: తక్కువేమి మనకు రాముడు ఒక్కడుండు వరకు చ 1: ప్రక్క తోడుగా భగవంతుడు మన చక్రధారియై చెంతనె యుండగ || తక్కువేమి || చ 2: మ్రుచ్చు సోమకుని మును జంపిన యా మత్స్యమూర్తి మన పక్షము నుండగ || తక్కువేమి || చ 3: సురల కొరకు మందరగిరి మోసిన కూర్మావతారుని కృపమనకుండగ || తక్కువేమి || చ 4: దురాత్ముడౌ హిరణ్యాక్షు ద్రుంచిన వరాహమూర్తి మనవాడై యుండగ || తక్కువేమి || చ 5: హిరణ్యకశిపుని ఇరుచెక్కలుగా పరచిన నరహరి ప్రక్కన నుండగ || తక్కువేమి || చ 6: భూమి స్వర్గమును పొందుగ గొలిచిన వామనుండు మనవాడై యుండగ || తక్కువేమి || చ 7: ధరలో క్షత్రియులను దండించిన పరశురాముని దయ మనకుండగ || తక్కువేమి || చ 8: దశగ్రీవు మును దండించిన యా దశరథరాముని దయ మనకుండగ || తక్కువేమి || చ 9: ఇలలో యదుకులమున నుదయించిన బలరాముడు మన బలమై యుండగ || తక్కువేమి || చ 10: దుష్ట కంసుని ద్రుంచినట్టి శ్రీ కృష్ణుడు మనపై కృపతో నుండగ || తక్కువేమి || చ 11: కలియుగాంత్యమున కలిగిన దైవము కలికిమూర్తిమము గాచుచు నుండగ || తక్కువేమి || చ 12: నారాయణదాసుని గాచిన శ్రీమన్ నారాయణు నెర నమ్మియుండగ...

హరి హరి రామ నన్నరమర జూడకు

Image
   హరి హరి రామ నన్నరమర జూడకు నిరతము నీ నామస్మరణ మే మరను దశరధ నందన దశముఖ మర్థన పశుపతి రంజన పాప విమోచన || హరి || మణిమయ భూషణ మంజుల భాషణ రణ జయ భీషణ రఘుకుల పోషణ || హరి || పతితపావన నామ భద్రాచలధామ సతతము శ్రీరామ దాసు నేలుమా రామ || హరి ||

హరి హరి హతాదరతయా సా గతా కుపితేవ

Image
                హరి హరి హతాదరతయా సా గతా కుపితేవ!!హరిహరి!! మామియం చలితా విలోక్య వృతం వధూ నిచయేన సాపరాధతయా మయాపి న వారితాతిభయేన!!హరిహరి!! కిం కరిష్యతి కిం వదిష్యతి సా చిరం విరహేణ! కిం ధనేన జనేన కిం మమ జీవితేన గృహేణ!!హరిహరి!! చింతయామి తదాననం కుటిల భ్రూ కోప భరేణ శోణ పద్మమివోపరి భ్రమతాకులం భ్రమరేణ!! తామహం హృది సంగతామనిశం భృశం రమయామి కిం వనేనుసరామి తామిహ కిం వృథా విలపామి!! క్షమ్యతామపరం కదాపి తవేదృశం న కరోమి దేహి సుందరి దర్శనం మమ మన్మథేన దునోమి!! వర్ణితం జయదేవకేన హరేరిదం ప్రవణేన బిందుబిల్వ సముద్ర సంభవ రోహిణీ రమణేన!!