Posts

Showing posts with the label భూపాల రాగ౦

హరి హరి హతాదరతయా సా గతా కుపితేవ

Image
                హరి హరి హతాదరతయా సా గతా కుపితేవ!!హరిహరి!! మామియం చలితా విలోక్య వృతం వధూ నిచయేన సాపరాధతయా మయాపి న వారితాతిభయేన!!హరిహరి!! కిం కరిష్యతి కిం వదిష్యతి సా చిరం విరహేణ! కిం ధనేన జనేన కిం మమ జీవితేన గృహేణ!!హరిహరి!! చింతయామి తదాననం కుటిల భ్రూ కోప భరేణ శోణ పద్మమివోపరి భ్రమతాకులం భ్రమరేణ!! తామహం హృది సంగతామనిశం భృశం రమయామి కిం వనేనుసరామి తామిహ కిం వృథా విలపామి!! క్షమ్యతామపరం కదాపి తవేదృశం న కరోమి దేహి సుందరి దర్శనం మమ మన్మథేన దునోమి!! వర్ణితం జయదేవకేన హరేరిదం ప్రవణేన బిందుబిల్వ సముద్ర సంభవ రోహిణీ రమణేన!!

మేలుకో శృంగార రాయ

Image
                        ప. మేలుకో శృంగారరాయ మేటి మదన గోపాల మేలుకోవే మాపాలి మించిన నిధానమా మేలుకో శృంగార రాయ మేటి మదన గోపాల మేలుకోవే మాపాలి మించిన నిధానమా మేలుకో శృంగార రాయ మేటి మదన గోపాల ఆ ఆ ఆ ఆ ఆ ఆ 1. సందడించే గోపికల జవ్వన వనములోన కందువ దిరిగే మదగజమవు - 2 ఇందుముఖి సత్యభామ హృదయ పద్మములోని గంధము మరిగినట్టి గండు తుమ్మెద -2!!మేలుకో!! 2.  గతి గూడి రుక్మిణి కౌగిటి పంజరములో రతి ముద్దు గులికేటి రాచిలుకా - 2 సతుల పదారువేల జంట కన్నుల గలువలు కితమై పొదిమిన నా యిందు బింబమా -2!!మేలుకో!! 3. వరుస కొలనిలోని వారి చన్ను గొండలపై నిరతి వాలిన నా నీలమేఘమా -2 సిరినురమున మోచి శ్రీ వేంకటాద్రి మీద గరిమ వరాలిచ్చే కల్పతరువా -2!!మేలుకో!!