ముందు వెనుక ఇరు ప్రక్కల తోడై
ప . ముందు వెనుకయిరు పక్కల తోడై ముర ఖర హర రారా అ . ఎందు కాన నీయందము వలె రఘు నందన వేగమే రారా ( ము ) చ 1. చండ భాస్కర కులాబ్ధి చంద్ర కోదండ పాణియై రారా అండ కొలుచు సౌమిత్రి సహితుడై అమిత పరాక్రమ రారా ( ము ) చ 2. ఓ గజ రక్షక ఓ రాజ కుమార ఓంకార సదన రారా భాగవత ప్రియ బాగ బ్రోవవయ్య త్యాగరాజ నుత రారా ( ము )