Posts

Showing posts with the label Lord Krishna

Krishna Sangeetham || Telugu Devotional Songs || Balamuralikrishna Sangeetham

Image

హరి కృష్ణ మేలుకొను ఆదిపురుషా

హరి కృష్ణ మేలుకొను ఆదిపురుషా తరవాత నా మోము తప్పకిటు చూడు మేలుకొను నాయన్న మెల్లనే నీతోడి బాలులదె పిలిచేరు బడి నాడను చాలు నిక నిద్దురలు చద్దికూళ్ళపొద్దు - వేళాయ నాతండ్రి వేగ లేవే. కను దెరవు నాతండ్రి కమలాప్తు డుదయించె వనిత మొకమజ్జనము వడి దెచ్చెను మొనసి మీతండ్రి యిదె ముద్దాడజెలగీని దనుజాంతకుండ యిక దగ మేలుకోవే లేవె నాతండ్రి నీలీలలటు వోగడేరు శ్రీ వేంకటాద్రిపతి శ్రీరమణుడా దేవతలు మునులు జెందిననారదాదులు ఆవలను బాడేరు ఆకసమునందు.

ఆడరమ్మా పాడరమ్మా

ఆడరమ్మా పాడరమ్మా అందరు మీరు వేడుక సంతసంబులు వెల్లివిరియాయను కమలనాభుడు పుట్టె కంసుని మదమణచ తిమిరి దేవకి దేవి దేహమందు అమరులకు మునులకభయమిచ్చె నితడు కొమరె గొల్లెతలపై కోరికలు నిలిపె రేయిపగలుగ చేసి రేపల్లె పెరుగుజొచ్చె ఆయెడా నావుల గాచె నాదిమూలము యీ యెడ లోకాలు చూపె నిట్టే తనకడుపులో మాయసేసి యిందరిలో మనుజుడైనిలిచె బాలలీలలు నటించి బహుదైవికము మించె పాలువెన్నలు దొంగిలె పరమమూర్తి తాళిభూభారమణచె ధర్మము పరిపాలించె మేలిమి శ్రీవేంకటాద్రి మీద నిట్టె నిలిచె

చిన్ని శిశువు

Image
                           చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నడు చూడమమ్మ ఇటువంటి శిశువు॥ తోయంపు కురులతోడ తూగేటిశిరసు, చింత కాయలవంటి జడలా గములతోడ మ్రోయుచున్న కనకపు మువ్వల పాదాలతోడ పయక యశోద వెంట పారాడు శిశువు॥ ముద్దుల వ్రేళ్ళతోడ మొరవంక యుంగగాల నిద్దపు చేతుల పైడి బొద్దుల తోడ అద్దపు చెక్కులతోడ అప్పలప్పలనినంత గద్దించి యశోదమేను కౌగిలించు శిశువు॥ బలుపైన పొట్ట మీది పాల చారలతోడ నులివేడి వెన్నతిన్న నోరితోడ చ్లగి నేడిదే వచ్చి శ్రీ వేంకటాద్రిపై నిలిచి లోకములెల్ల నిలిపిన శిశువు॥

అతడెవ్వాడు చూపరే అమ్మలాల

Image
                      అతడెవ్వాడు చూపరే అమ్మలాల ఏతుల నాడేటి క్రిశ్ణుడీతడే కాడుగదా || కందువ దేవకి బిడ్డగనె నట నడురేయి అందియ్శోదకు గొడుకైనాడుట నందడించి పూతకిచంటి పాలుదాగెనట మందల ఆవులగాచి మలసెనట || మంచిబండి దన్నెనట ముద్దులు విరిచెనట ఇంచుకంతవేల గొండయెత్తి నాడుట మంచాలపై గొల్లెతలమానాలు చేకొనెనట మించుల బిల్ల గోలివట్టి మెరసెనట || కాళింగుని మెట్టెనట కంసుబొరిగొనెనట పాలించి సురల జేపట్టెనట యీలీల వేంకటాద్రి నిరవైనదేవుడట యేలెనట పదారు వేలింతుల నిందరిని ||

ముద్దులు మోమున ముంచగను

Image
                             ముద్దులు మోమున ముంచగను నిద్దపు కూరిమి నించీని మొలచిరుగంటలు మువ్వలు గజ్జెలు గలగలమనగా కదలగను ఎలనవ్వులతో ఈతడు వచ్చి జలజపు చేతులు చాచీనీ అచ్చపు గుచ్చు ముత్యాల హారములు పచ్చల చంద్రాభరణములు తచ్చిన చేతుల తానె దైవమని అచ్చట నిచ్చట ఆడీని బాలుడు కృష్ణుడు పరమపురుషుడు నేలకు నింగికి నెరి పొడవై చాల వేంకటాచలపతి తానై మేలిమి చేతల మించీని