Posts

Showing posts with the label శ్రీ రాగం

శ్రీమూలాధారా చక్ర

Image
                      ప . శ్రీ మూలాధార చక్ర వినాయక అమూల్య వర ప్రదాయక అ . మూలాజ్ఞాన శోక వినాశక మూల కంద ముక్తి ప్రదాయక 1. సకలీకృత దేవాధిదేవా శబలీ కృత సర్వజ్ఞ స్వభావ ప్రకటీ కృత వైఖరీ స్వభావ పరాభవ ప్రసిద్ధ గజగ్రీవ వికట షట్ - శత శ్వాసాధికార విచిత్రాకార భక్తోపకార ఆకళంక విభాస్వర విఘ్నేశ్వర హర గురుగుహ సోదర లంబోదర

2. తిరువీధుల మెరసె

Image
                                                 ప. తిరువీధుల మెరసే దేవదేవుడు గరిమల మించిన సింగారముల తోడనూ!! 1. తిరుదండెలపైనేగి దేవుడిదే తొలినాడు సిరులా రెండవనాడు శేషుని మీద మిరిపెన మూడోనాడు ముత్యాలపందిరి క్రింద పోరి నాలుగోనాడు పూవు కోవెల లోను!! 2. గక్కన ఐదావనాడు గరుడుని మీద ఎక్కెను ఆరవనాడు ఏనుగు మీద చొక్కమై ఏడవనాడు సూర్య ప్రభలోనను యిక్కువ తేరును గుర్రమెనిమిదో నాడు!! 3. కనకపుటందలము కదసి తొమ్మిదోనాడు పెనచి పదోనాడు పెండ్లిపీట ఎనసి శ్రీవెంకటేశుడింతి అలమేల్మంగతో వనితల నడుమను వాహనాల మీదను!!

ఎందఱో మహానుభావులు

Image
                                                                                  ప . ఎందరో మహానుభావులందరికి వందనము అ . చంద్ర వదనునియంద చందమును హృదయారవిందమున జూచి బ్రహ్మానందమనుభవించు వా ( రెందరో ) చ 1. సామ గాన లోల మనసిజ లావణ్య ధన్య మూర్ధన్యు ( లెందరో ) చ 2. మానస వన చర వర సంచారము సలిపి మూర్తి బాగుగ పొడగనే వా ( రెందరో ) చ 3. సరగున పాదములకు స్వాంతమను సరోజమును సమర్పణము సేయు వా ( రెందరో ) చ 4. పతిత పావనుడనే పరాత్పరుని గురించి పరమార్థమగు నిజ మార్గముతోను పాడుచును సల్లాపముతో స్వర లయాది రాగములు తెలియు వా ( రెందరో ) చ 5. హరి గుణ...