మర్ద మర్ద మమ బంధాని
ప || మర్ద మర్ద మమ బంధాని | దుర్దాంత మహాదురితాని || చ || చక్రాయుధ రవిశత తేజోంచిత | సక్రోధసహస్ర ప్రముఖ | విక్రమక్రమా విస్ఫులింగకణ | నక్రహరణ హరినవ్యకరాంక || చ || కలితసుదర్శన కఠినవిదారణ | కులిశకోటిభవ ఘోషణా | ప్రళయానలసంభ్రమ విభ్రమకర | రళితదైతగళ రక్తవికీరణా || చ || హితకరశ్రీవేంకటేశప్రయుక్త | సతతపరాక్రమ జయంకర | చతురోహంతే శరణం గతోస్మి | యితరాన్ విభజ్య యిహ మాం రక్ష ||