Posts

అప్ప రామ భక్తియెంతో గొప్పరా

Image
ప. అప్ప రామ భక్తియెంతో గొప్పరా మా(యప్ప) అ. త్రిప్పటలను తీర్చి కంటి రెప్ప వలెను కాచునా మా(యప్ప) చ 1. లక్ష్మి దేవి వలచునా లక్ష్మణుండు కొలుచునా సూక్ష్మ బుద్ధి గల భరతుడు జూచి జూచి సొలసునా మా(యప్ప) చ 2. శబరియెంగిలిచ్చునా చంద్ర ధరుడు మెచ్చునా అబల స్వయంప్రభకు దైవమచల పదవినిచ్చునా మా(యప్ప) చ 3. కపి వారిధి దాటునా కలికి రోట కట్టునా అపరాధి త్యాగరాజుకానందము హెచ్చునా మా(యప్ప)

వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట

Image
వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట చేసిన ధర్మము చెడని పదార్ధము చేరును నీ వెంట చేతిలో అమృతము ఉన్నంత సేపే అన్నదమ్ములంట ఆ ఘాధం బై పోయేనాడు ఎవరురారు వెంట వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట చేసిన ధర్మము చెడని పదార్ధము చేరును నీ వెంట పంచ భూతముల తోలు బొమ్మతో ప్రపంచమా యె నట అంతము వరకు కించిత్ ఆశతో పెంచెను జగమంతా వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట చేసిన ధర్మము చెడని పదార్ధము చేరును నీ వెంట

ఏమీ సేతురా లింగా

Image
ఏమీ సేతురా లింగా   ఏమి సే తూ ఏమీ సేతురా లింగా ఏమి సేతూ రా ఏమీ సేతురా లింగా ఏమి సేతూ రా గంగ ఉదకము తెచ్చి నీకు లింగపూజలు చే దమంటే గంగనున్న చేప కప్ప ఎంగిలంటున్నాది లింగా మహానుభావా మా లింగ ముర్తీ మా దేవ శంభో ఏమీ సేతురా లింగా ఏమి సేతూరా అక్షయావుల పాడి తెచ్చి అర్పితము చేదమంటే అక్షయావుల లేగదూడ ఎంగిలంటున్నాది లింగా మహానుభావా మా దేవ శంభో మా లింగ ముర్తీ ఏమీ సేతురా లింగా ఏమి సేతూరా తుమ్మి పూవులు తెచ్చి నీకు తుష్టుగా పూ చే దమంటే ఓహో కొమ్మ కొమ్మకు కోటి తుమ్మెద ఎంగిలంటున్నాది లింగా.అ మహానుభావా మా దేవ శంభో మా లింగ మూర్తీ ఏమీ సేతురా లింగా ఏమి సేతూరా

రామరామరామ యన్న రామచిలుక ధన్యము

Image
రామరామరామ యన్న రామచిలుక ధన్యము రామప్రేమ చూరగొన్న చిట్టి వుడుత ధన్యము అభినందనలందుకొన్న కోతిమూక ధన్యము ఆశ్సీసులు పొందిన ఆ పక్షిరాజు ధన్యము రేగుపండ్లు తినిపించిన శబరిమాత ధన్యము నావ నడిపి దరిచేర్చిన గుహుని సేవ ధన్యము పాదధూళి సోకినట్టి శిల ఎంతో ధన్యము వారధి నిలిపిన సాగరజలమెంతో ధన్యము       నిదురమాని కాచిన సౌమిత్రి సేవ ధన్యము పాదుకలను పూజించిన భరత భక్తి ధన్యము అహరహము రామ అనే హనుమ జపము ధన్యము   రామకధలు రచియించిన కవుల కవిత ధన్యము త్యాగరాజ స్వామివారి సంకీర్తన ధన్యము   భద్రాచల రామదాసు భక్తి ఎంతో ధన్యము రాముని కరమున విరిగిన శివుని విల్లు ధన్యము   రాముని పతిగా పొందిన సీత జన్మ ధన్యము మధురాతి మధురము రెండక్షరాల మంత్రము   సత్యధర్మమూర్తిత్వము   రాముని అవతారము రామభక్తి పలికించిన రామగీతి ధన్యము రామభక్తులందరికీ నిశ్చయముగ మోక్షము  

వినయమునను కౌశికుని వెంట

ప. వినయమునను కౌశికుని వెంట చనినాంఘ్రులను జూచునదెన్నటికో అందు వెనుక రాతిని నాతి జేసిన చరణములను జూచునదెన్నటికో (వి) చ 1. ఘనమైన శివుని చాపము ద్రుంచిన పాదమును జూచునదెన్నటికో ఆ జనక రాజు పాల కడిగినయా కాళ్ళను జూచునదెన్నటికో (వి) చ 2. చనువున సీతను బొట్టు కట్టిన కరమును జూచునదెన్నటికో కోపమున భృగు సుతు చాప బలమందుకొన్న బాహువు జూచునదెన్నటికో (వి) చ 3. వనమున చని విరాధుని చంపిన చేతులను జూచునదెన్నటికో అల్ల ముని జనులను కని అభయమిచ్చిన హస్తమును జూచునదెన్నటికో (వి) చ 4. తనకు తానే కాకాసురుని కాచిన శరమును జూచునదెన్నటికో క్షణమున బహు రథముల పొడి చేసిన- యస్త్రమును జూచునదెన్నటికో (వి) చ 5. ఘన బలుడైన వాలిని చంపిన బాణమును జూచునదెన్నటికో ఆ వనధి మద గర్వమణచిన సాయకమును జూచునదెన్నటికో (వి) చ 6. కని కరమున విభీషణుని జూచిన కన్నులను జూచునదెన్నటికో రావణుని కొట్టి పేద కపులు లేవ జూచు దృష్టిని జూచునదెన్నటికో (వి) చ 7. వన చరాధిపుని చల్లగ జూచిన నేత్రమును జూచునదెన్నటికో దినమును లంక వర్ధిల్లను జూచు లోచనమును జూచునదెన్నటికో (వి) చ 8. ఘనమైన పుష్పకమున రాజిల్లిన సొగసు...