నను పాలింపగ

ప. నను పాలింప నడచి వచ్చితివో
నా ప్రాణ నాథ

అ. వనజ నయన మోమును జూచుట
జీవనమని నెనరున మనసు మర్మము తెలిసి (నను)


చ. సుర పతి నీల మణి నిభ తనువుతో
ఉరమున ముత్యపు సరుల చయముతో
కరమున శర కోదండ కాంతితో
ధరణి తనయతో త్యాగరాజార్చిత (నను)

Popular posts from this blog

భో శంభో శివ శంభో స్వయంభో

మంగళం జయ మంగళం.. మా నల్లనయ్యకు మంగళం

రామరామరామ యన్న రామచిలుక ధన్యము