ముందు వెనుక ఇరు ప్రక్కల తోడై

                          


. ముందు వెనుకయిరు పక్కల తోడై
ముర ఖర హర రారా

. ఎందు కాన నీయందము వలె రఘు
నందన వేగమే రారా (ము)

1. చండ భాస్కర కులాబ్ధి చంద్ర
కోదండ పాణియై రారా
అండ కొలుచు సౌమిత్రి సహితుడై
అమిత పరాక్రమ రారా (ము)

2. గజ రక్షక రాజ కుమార
ఓంకార సదన రారా
భాగవత ప్రియ బాగ బ్రోవవయ్య
త్యాగరాజ నుత రారా (ము)

Popular posts from this blog

భో శంభో శివ శంభో స్వయంభో

మంగళం జయ మంగళం.. మా నల్లనయ్యకు మంగళం

రామరామరామ యన్న రామచిలుక ధన్యము