బంటు రీతి

ప. బంటు రీతి కొలువియ్యవయ్య రామ

అ. తుంట వింటి వాని మొదలైన
మదాదుల కొట్టి నేల కూల జేయు నిజ (బ)

చ. రోమాంచమను ఘన కంచుకము
రామ భక్తుడను ముద్ర బిళ్ళయు
రామ నామమను వర ఖడ్గమివి
రాజిల్లునయ్య త్యాగరాజునికే (

Popular posts from this blog

భో శంభో శివ శంభో స్వయంభో

మంగళం జయ మంగళం.. మా నల్లనయ్యకు మంగళం

రామరామరామ యన్న రామచిలుక ధన్యము