వెడలెను కోదండ పాణి

ప. వెడలెను కోదండ పాణి
అనుజ సౌమిత్రిని కూడి

అ. పుడమిలో జనులెల్ల పొగడ
పూజితుడౌ మౌని వెంట (వె)

చ. శిరమున కొండెయు జార-
యురమున హారములు మెరయ
కరమున శర చాపములు ఘనముగ వెలయ
సురుచిర వాద్యములు మ్రోయ
సురులెల్ల వినుతి సేయ
వర త్యాగరాజ నుతుడు వసుధ
భారమెల్ల తీర్ప (వె)

Popular posts from this blog

భో శంభో శివ శంభో స్వయంభో

మంగళం జయ మంగళం.. మా నల్లనయ్యకు మంగళం

రామరామరామ యన్న రామచిలుక ధన్యము