నంద గోపాల ముకుంద
ప. నంద గోపాల ముకుంద
గోకుల నందన యమునా తీర విహార
అ.ప.మందర గిరిధర మామవమాధవ
మురళీధర మధుసూదన హరే
చ. మందహాస వదన మంజుల చరణ
అరవింద లోచన ఆశ్రిత రక్షణ
పీతాంబర ధర పన్నగ శయన
కలి కల్మష హరణ కరుణా పూరణ
వందిత మునిబృంద గురు గుహానంద
వైకుంఠ స్థితానంద కంద
గోవర్ధనోద్ధార గోపస్త్రీ జార గోవింద