సీతమ్మ మాయమ్మ

                       


2. . సీతమ్మ మాయమ్మ శ్రీ రాముడు మా తండ్రి

. వాతాత్మజ సౌమిత్రి వైనతేయ రిపు మర్దన
ధాత భరతాదులు సోదరులు మాకు మనసా (సీ)

. పరమేశ వసిష్ఠ పరాశర నారద శౌనక శుక
సుర పతి గౌతమ లంబోదర గుహ సనకాదులు
ధర నిజ భాగవతాగ్రేసరులెవరో వారెల్లరు
వర త్యాగరాజునికి పరమ బాంధవులు మనసా (సీ)

Popular posts from this blog

భో శంభో శివ శంభో స్వయంభో

మంగళం జయ మంగళం.. మా నల్లనయ్యకు మంగళం

రామరామరామ యన్న రామచిలుక ధన్యము