కాలహరణమేలరా
అ. కాల హరణమేల సుగుణ
జాల కరుణాలవాల (కా)
చ1. చుట్టి చుట్టి పక్షులెల్ల
చెట్టు వెదకు రీతి భువిని
పుట్టగనే నీ పదముల
పట్టుకొన్న నన్ను బ్రోవ (కా)
చ2. పొడవునయెంతాడుకొన్న
భూమిని త్యాగంబు రీతి
కడు వెలసియున్న నీవు
గాకయెవరు నన్ను బ్రోవ (కా)
చ3. దిన దినమును తిరిగి తిరిగి
దిక్కు లేక శరణు జొచ్చి
తనువు ధనము నీదేయంటి
త్యాగరాజ వినుత రామ (కా)