పక్కల నిలబడి



    
ప. పక్కల నిలబడి కొలిచే ముచ్చట
బాగ తెల్ప రాదా

అ. చుక్కల రాయని కేరు మోము గల
సు-దతి సీతమ్మ సౌమిత్రి రామునికిరు (ప)

చ. తనువుచే వందనమొనరించుచున్నారా
చనువున నామ కీర్తన సేయుచున్నారా
మనసున తలచి మై మరచియున్నారా
నెనరుంచి త్యాగరాజునితో హరి హరి మీరిరు (ప)

Popular posts from this blog

భో శంభో శివ శంభో స్వయంభో

మంగళం జయ మంగళం.. మా నల్లనయ్యకు మంగళం

రామరామరామ యన్న రామచిలుక ధన్యము