వినాయకుని వలెను

ప. వినాయకుని వలెను బ్రోవవే నిను
వినా వేల్పులెవరమ్మా

అ. అనాథ రక్షకి శ్రీ కామాక్షి
సు-జనాఘ మోచని శంకరి జనని (వి)

చ1. నరాధములకును వరాలొసగ-
నుండ్రములై భూ-సురాది దేవతలు
రాయిడిని జెంద రాదు దయ
జూడ రాదా కాంచీ పురాది నాయకి (వి)

చ2. పితామహుడు జన హితార్థమై
నిన్ను తా తెలియ వేడ తాళిమి గల
అవతారమెత్తియికను తామసము
సేయ తాళ జాలము నతార్తి హారిణి (వి)

చ3. పురాన దయచే గిరాలు మూకునికి
రా జేసి బ్రోచు రాజ ధరి
త్యాగరాజుని హృదయ సరోజమేలిన
రామ సోదరి పరా శక్తి నను (వి)

Popular posts from this blog

భో శంభో శివ శంభో స్వయంభో

మంగళం జయ మంగళం.. మా నల్లనయ్యకు మంగళం

రామరామరామ యన్న రామచిలుక ధన్యము