క్షీరసాగర విహార

ప. క్షీర సాగర విహార అపరిమిత
ఘోర పాతక విదార
క్రూర జన గణ విదూర నిగమ
సంచార సుందర శరీర

చ1. శతమఖాహిత విభంగ శ్రీ రామ
శమన రిపు సన్నుతాంగ
శ్రిత మానవాంతరంగ జనకజా
శృంగార జలజ భృంగ (క్షీ)

చ2. రాజాధి రాజ వేష శ్రీ రామ
రమణీయ కర సు-భూష
రాజ నుత లలిత భాష శ్రీ త్యాగ-
రాజాది భక్త పోష (క్షీ)

Popular posts from this blog

భో శంభో శివ శంభో స్వయంభో

మంగళం జయ మంగళం.. మా నల్లనయ్యకు మంగళం

రామరామరామ యన్న రామచిలుక ధన్యము