నాద తనుమనిశం శంకరం Get link Facebook X Pinterest Email Other Apps October 23, 2013 ప. నాద తనుమనిశం శంకరం నమామి మే మనసా శిరసా అ. మోదకర నిగమోత్తమ సామ వేద సారం వారం వారం (నా) చ. సద్యోజాతాది పంచ వక్త్రజ స-రి-గ-మ-ప-ధ-ని వర సప్త-స్వర విద్యా లోలం విదళిత కాలం విమల హృదయ త్యాగరాజ పాలం (నా) Get link Facebook X Pinterest Email Other Apps Comments
భో శంభో శివ శంభో స్వయంభో March 18, 2014 ప. భో శంభో శివ శంభో స్వయంభో అ.ప. గంగాధర శంకర కరుణాకర మామవ భవసాగర తారక |4| !! భో శంభో!! చ. 1. నిర్గుణ పరబ్రహ్మ స్వరూప గమగమ భూత ప్రపంచ రహిత నిజపుర నిహిత నితాంత అనంత ఆనంద అతిశయ అక్షయలింగ !! భో శంభో!! చ. 2. ధిమిత ధిమిత ధిమి ధిమికిట తకిటతోం - తోం తోం తిమికిట తరికిట కిటతోం - మతంగ మునివర వందిత ఈశా సర్వ దిగంబర వేష్టితవేష నిత్య నిరంజన నిత్యనటేశ - ఈశ సభేశ సర్వేశ !! భో శంభో!! | మతంగ ... | మతంగ మునివర వందిత ఈశ శర్వ దిగంబర వేష్టితవేష - 2 నిత్య నిరంజన నిత్యనటేశ - 2 ఈశ సభేశ సర్వేశ !! భో శంభో! Read more
మంగళం జయ మంగళం.. మా నల్లనయ్యకు మంగళం March 13, 2018 మంగళం జయ మంగళం .. మా నల్లనయ్యకు మంగళం .. ||2|| మంగళం జయ మంగళం .. మా కృష్ణ స్వామికి మంగళం .. ||2|| || మంగళం || శిరమునందున మెరయుచుండెడి నెమలి పింఛకు మంగళం .. ||2|| శ్యామలాంగుని కరములందలి మధురమురళికి మంగళం ..||2|| || మంగళం || వనజగమ్మును ధిక్కరించెడి వదనశోభకు మంగళం ...||2|| కరుణరసమును చిందుచుండెడి కన్నుదోయికి మంగళం ..||2|| || మంగళం || బ్రహ్మచే పూజింపబడిన చరణయుగళికి మంగళం ..||2|| జగములన్నియు కన్నతండ్రగు చక్కనయ్యకు మంగళం .. ||2|| || మంగళం || గోపికా గణసేవితుడు శ్రీ గోవిందునకు మంగళం .. ||2|| రాధికా పరివేష్టితుండౌ రసేశ్వరునకు మంగళం ... ||2|| || మంగళం || Read more
రామరామరామ యన్న రామచిలుక ధన్యము July 13, 2019 రామరామరామ యన్న రామచిలుక ధన్యము రామప్రేమ చూరగొన్న చిట్టి వుడుత ధన్యము అభినందనలందుకొన్న కోతిమూక ధన్యము ఆశ్సీసులు పొందిన ఆ పక్షిరాజు ధన్యము రేగుపండ్లు తినిపించిన శబరిమాత ధన్యము నావ నడిపి దరిచేర్చిన గుహుని సేవ ధన్యము పాదధూళి సోకినట్టి శిల ఎంతో ధన్యము వారధి నిలిపిన సాగరజలమెంతో ధన్యము నిదురమాని కాచిన సౌమిత్రి సేవ ధన్యము పాదుకలను పూజించిన భరత భక్తి ధన్యము అహరహము రామ అనే హనుమ జపము ధన్యము రామకధలు రచియించిన కవుల కవిత ధన్యము త్యాగరాజ స్వామివారి సంకీర్తన ధన్యము భద్రాచల రామదాసు భక్తి ఎంతో ధన్యము రాముని కరమున విరిగిన శివుని విల్లు ధన్యము రాముని పతిగా పొందిన సీత జన్మ ధన్యము మధురాతి మధురము రెండక్షరాల మంత్రము సత్యధర్మమూర్తిత్వము రాముని అవతారము రామభక్తి పలికించిన రామగీతి ధన్యము రామభక్తులందరికీ నిశ్చయముగ మోక్షము Read more
Comments
Post a Comment