కోటి నదులు ధనుష్కోటిలోనుండగ

                       


. కోటి నదులు ధనుష్కోటిలోనుండగ
ఏటికి తిరిగెదవే మనసా

. సూటిగ శ్యామ సుందర మూర్తిని
మాటి మాటికి జూచే మహారాజులకు (కో)

. గంగ నూపురంబునను జనించెను
రంగని కావేరి కని రాజిల్లెను
పొంగుచు శ్రీ రఘు నాథుని ప్రేమతో
పొగడే త్యాగరాజు మనవి వినవే (కో)

Popular posts from this blog

భో శంభో శివ శంభో స్వయంభో

మంగళం జయ మంగళం.. మా నల్లనయ్యకు మంగళం

రామరామరామ యన్న రామచిలుక ధన్యము