హరియే ఎరుగును అ౦దరి బతుకులు

                     


ప. హరియే ఎరుగును అందరి బతుకులు
యిరవై ఈతని యెరుగుటే మేలు

౧. వెనకటి బ్రహ్మలు వేవేల సంఖ్యలు
యెనసి బ్రహ్మాండము లేలిరట
పెనగొని వారల పేరులు మరచిరి
మనుజ కీటముల మరెవ్వడెరుగు

౨. ఆసఁదొల్లి మును లనంతకోట్లు
చేసిరి తపములు సేనలుగా
యేసిరులందిరి యెరగ రెవ్వరును
వేసపునరులకు విధి యేదో

౩. కలవనేకములు కర్మ మార్గములు
పలుదేవతలిటు పాటించిరి
బలిమి శ్రీ వేంకట పతికి మొరయిడి
వెలసిరి తుదనిదె వెరవిందరికి

Popular posts from this blog

భో శంభో శివ శంభో స్వయంభో

మంగళం జయ మంగళం.. మా నల్లనయ్యకు మంగళం

రామరామరామ యన్న రామచిలుక ధన్యము