ఇటు గరుడని నీ వెక్కినను

   


ఇటు గరుడని నీ వెక్కినను 
పటపట దిక్కులు బగ్గన బగిలె

ఎగసినగరుడని యేపున'ధా'యని 
జిగిదొలకచబుకు చేసినను
నిగమాంతంబులు నిగమసంఘములు 
గగనము జగములు గడగడ వడకె!!ఇటు!!

బిరుసుగ గరుడని పేరెము దోలుచు 
బెరసి నీవు గోపించినను
సరుస నిఖిలములు జర్జరితములై 
తిరువున నలుగడ దిరదిర దిరిగె!!ఇటు!!

పల్లించిననీపసిడిగరుడనిని 
కెల్లున నీవెక్కినయపుడు
ఝల్లనె రాక్షససమితి నీ మహిమ 
వెల్లి మునుగుదురు వేంకటరమణ!!ఇటు!!

Popular posts from this blog

భో శంభో శివ శంభో స్వయంభో

మంగళం జయ మంగళం.. మా నల్లనయ్యకు మంగళం

రామరామరామ యన్న రామచిలుక ధన్యము