పరతత్వంబగు బాలుడు



పరతత్వం బగు బాలుడు
పరిపరివిధముల బాలుడు

చద్దులమూటలు చంకల వ్రేలెడి
ముద్దులపడుచుల మూకలతో
పెద్దరికంబున పేయల( గాచిన
బద్దులనటనల బాలుడూ!!

వెన్నలుదాకగ వేట్లాడుచును
సన్నపుబడుచుల సంగడిని
కన్నెలు దూరగ కలకల నవ్విన
పన్నిన మాయల బాలుడు!!

బచ్చన రూపుల పాయపుబడుచులు
నిచ్చలు కొలువగ నెమ్మదిని
నచ్చిన వేంకట నగమున నాడెడి
పచ్చిలపదకపు బాలుడు!!

Popular posts from this blog

భో శంభో శివ శంభో స్వయంభో

మంగళం జయ మంగళం.. మా నల్లనయ్యకు మంగళం

రామరామరామ యన్న రామచిలుక ధన్యము