చక్కని తల్లికి చాంగభళా

                    
చక్కని తల్లికి చాంగుభళా తన
చక్కెర మోవికి చాంగుభళా

కులికెడి మురిపెపు కుమ్మరింపు తన
సళుపు జూపులకు చాంగుభళా
పలుకుల సొలపుల బతితో గసరెడి
చలముల యలుకకు చాంగుభళా!!

కిన్నెరతో పతి కెలన నిలుచు తన
చన్ను మెఱుగులకు చాంగుభళా
ఉన్నతి బతిపై నొరగి నిలుచు తన
సన్నపు నడిమికి చాంగుభళా!!

జందెపు ముత్యపు సరులహారముల
చందన గంధికి చాంగుభళా
విందయి వెంకట విభుబెన చినతన
సంది దండలకు చాంగుభళా!!

Popular posts from this blog

భో శంభో శివ శంభో స్వయంభో

మంగళం జయ మంగళం.. మా నల్లనయ్యకు మంగళం

రామరామరామ యన్న రామచిలుక ధన్యము