హరి కృష్ణ మేలుకొను ఆదిపురుషా

హరి కృష్ణ మేలుకొను ఆదిపురుషా
తరవాత నా మోము తప్పకిటు చూడు

మేలుకొను నాయన్న మెల్లనే నీతోడి
బాలులదె పిలిచేరు బడి నాడను
చాలు నిక నిద్దురలు చద్దికూళ్ళపొద్దు -
వేళాయ నాతండ్రి వేగ లేవే.

కను దెరవు నాతండ్రి కమలాప్తు డుదయించె
వనిత మొకమజ్జనము వడి దెచ్చెను
మొనసి మీతండ్రి యిదె ముద్దాడజెలగీని
దనుజాంతకుండ యిక దగ మేలుకోవే

లేవె నాతండ్రి నీలీలలటు వోగడేరు
శ్రీ వేంకటాద్రిపతి శ్రీరమణుడా
దేవతలు మునులు జెందిననారదాదులు
ఆవలను బాడేరు ఆకసమునందు.

Comments

Popular posts from this blog

వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట

వీడివో అల విజయరాఘవుడు

పరమేశ్వరాజ్ఞ ఏమో తెలియదు అది ఎవరెరుగరు ఈశ్వరాజ్ఞ