అటవీ స్థలములు కడుగుదమా
అటవీ స్థలములు కరుగుదమా
చెలి వట పత్రమ్ములు కోయుదమా!!2
సార్లు!!
చింత పిక్కాలాడుదమా చిరు చిరు నవ్వులు
నవ్వుదమా!!అటవీ!!
చెమ్మా చెక్కాలాడుదమా చక్కిలిగింతలు
పెట్టుదమా!!అటవీ!!
కోతీ కొమ్మచ్చులాడుదమా కొమ్మల చాటున దాగుదమా!!అటవీ!!
చల్లని గంధం తీయుదమా సఖియా మెడలో
పూయుదమా!!అటవీ!!
పూలదండలు గుచ్చుదమా దేవుని మెడలో
వేయుదమా!!అటవీ!!