ఏమని నెర నమ్ముకొందుము కృష్ణా



ప. ఏమని నెర నమ్ముకొందుము కృష్ణా
ఎందుకింత వాదు

1. జలకమాడు వేళ వలువలు దాచి
మమ్మలయింపగ లేదా కృష్ణా (ఏ)

2. ముదితల రమ్మని తిలకములిడి పంట
మోవి నొక్క లేదా కృష్ణా (ఏ)

3. మును నీవు వెన్ననారగించి తరుణుల
మోమున పూసి పో-లేదా కృష్ణా (ఏ)

4. వదినెగారి చందమున వచ్చి పావడ
వదలించి పో-లేదా కృష్ణా (ఏ)

5. దొరికితివని చాడి చెప్ప పోతే తల్లి
ఉరముననుండ లేదా కృష్ణా (ఏ)

6. కామించి యజ్ఞ పత్నులు వేడగ వేణు
గానమొనర్ప లేదా కృష్ణా (ఏ)

7. ఆ నాడు పొంగలి నీకిడి కొన్నాళ్ళు
వాననుండ లేదా కృష్ణా (ఏ)

8. ధరను త్యాగరాజ వినుతుని పలుకులు
తప్పి పోవన లేదా కృష్ణా (ఏ)

Popular posts from this blog

భో శంభో శివ శంభో స్వయంభో

మంగళం జయ మంగళం.. మా నల్లనయ్యకు మంగళం

రామరామరామ యన్న రామచిలుక ధన్యము