అభిమానమెన్నడు కల్గురా

               


ప. అభిమానమెన్నడు కల్గురా
అనాథుడైన నాదుపై నీకు

అ. అపరాధములన్ని మన్నింపుమయ్య
అభిరామ పట్టాభిరామ నాయందు (అభి)

చ. కన్న తల్లియు కన్న తండ్రియు
అన్నియు నీవేయని నమ్మ లేదా
నిను వినా గతి నాకెవరు లేరే
నన్ను బ్రోవు త్యాగరాజ వినుత (అభి)

Popular posts from this blog

భో శంభో శివ శంభో స్వయంభో

మంగళం జయ మంగళం.. మా నల్లనయ్యకు మంగళం

రామరామరామ యన్న రామచిలుక ధన్యము