మాకులమునకిహ పరమొసగిన నీకు



ప. మా కులమునకిహ పరమొసగిన నీకు
మంగళం శుభ మంగళం

అ. మాకుల బ్రోచిన మదన జనక నీకు
మంగళం శుభ మంగళం (మా)

1. మద గజ గమన మానిత సద్-గుణ నీకు
మంగళం శుభ మంగళం
మద మోహ రహిత మంజుళ రూప ధర నీకు
మంగళం శుభ మంగళం (మా)

2. మనసిజ వైరి మానస సదన నీకు
మంగళం శుభ మంగళం
మనవిని విని మమ్మేలుకొన్న నీకు
మంగళం శుభ మంగళం (మా)

3. మా మనసున నెలకొన్న కృష్ణ నీకు
మంగళం శుభ మంగళం
మా మనోహర పాలిత త్యాగరాజ నీకు
మంగళం శుభ మంగళం (మా)

Popular posts from this blog

భో శంభో శివ శంభో స్వయంభో

మంగళం జయ మంగళం.. మా నల్లనయ్యకు మంగళం

రామరామరామ యన్న రామచిలుక ధన్యము