లాలి శ్రీకృష్ణయ్యా నీల మేఘవర్ణా



లాలి శ్రీ కృష్ణయ్యా, నీల మేఘవర్ణా
బాల గోపాల నీవు, పవ్వళింపరా

శృంగారించిన మంచి, బంగారు ఊయలలో
శంఖు చక్ర ధర స్వామి, నిదుర పోరా

లలితాంగి రుక్మిణి, లలనయె కవలెనా
పలుకు కోయిల, సత్య భామె కవలెనా

ఎవ్వరు కావలెనయ్య, ఇందరిలో నీకు
నవమోహనంగనా, చిన్ని కృష్ణయ్య

అలుకలు పోవేల, అలమేలు మంగతొ
కులుకుతు శయనించు,వేంకటెశ్వరుడా

Popular posts from this blog

భో శంభో శివ శంభో స్వయంభో

మంగళం జయ మంగళం.. మా నల్లనయ్యకు మంగళం

రామరామరామ యన్న రామచిలుక ధన్యము