చాలు చాలు నీ యుక్తులు నడవదు

     


ప. చాలు చాలు నీ యుక్తులు నడవదు
సారసాక్ష శ్రీ కృష్ణా

అ. శూల ధరాదులకరుదైన మము కూడి
సుఖమనుభవింపవే శ్రీ కృష్ణా (చా)

1. అధర రదనముల కని సొక్కుచు
మేమాసించి వచ్చితిమి
బుధ రక్షక శల్య సారథ్యమొనరించి
బొంకేదెరుగమైతిమి శ్రీ కృష్ణా (చా)

2. కండ చక్కెరవంటి పలుకులు విని మేము
కామించి వచ్చితిమి
ఉండియుండి బాలుని గిల్లి మరి తొట్ల-
నూచేదెరుగమైతిమి శ్రీ కృష్ణా (చా)

3. త్యాగరాజ నుతుడని అతి ప్రేమతో
తరుణులు వచ్చితిమి
భోగి శయన మా మాటలు మీరకు
బుద్ధిశాలివౌదు సుమీ శ్రీ కృష్ణా (చా)

Popular posts from this blog

భో శంభో శివ శంభో స్వయంభో

మంగళం జయ మంగళం.. మా నల్లనయ్యకు మంగళం

రామరామరామ యన్న రామచిలుక ధన్యము