చూతాము రారే యీ వేడ్కను సుదతులార నేడు



ప. చూతాము రారేయీ వేడ్కను సుదతులార నేడు

అ. పురుహూతాదులకరుదైనయోడలో
యువతులెల్ల హరిని కూడియాడెదరు (చూ)

1. ఒకరికొకరు గంధమునలదెదరు
ఒకరికొకరు తిలకము దిద్దెదరు
ఒకరికొకరు విడెములొసగెదరు
ఒకరికొకరు హారము వేసెదరు (చూ)

2. ఒకరికొకరు వలువలు కట్టెదరు
ఒకరికొకరు రవికెలు తొడిగెదరు
ఒకరినొకరు కౌగిట కూర్చెదరు
ఒకరికొకరు తమలో సొక్కెదరు (చూ)

3. ఒకరికొకరు పాటలు పాడెదరు
ఒకరికొకరు సరసములాడెదరు
ఒకరినొకరు హరియని జూచెదరు
ఒకరినొకరు కానక భ్రమసెదరు (చూ)

Popular posts from this blog

భో శంభో శివ శంభో స్వయంభో

మంగళం జయ మంగళం.. మా నల్లనయ్యకు మంగళం

రామరామరామ యన్న రామచిలుక ధన్యము