ఆడవారమెల్ల కూడి

              


ప. ఆడవారమెల్ల కూడి మన-
మాడుదాము హరిని వేడి

1. కృష్ణుడు జూడగ మనము జల
క్రీడ సల్ప మంచి దినము (ఆ)

2. కమల నేత్రుని బాసి సుఖమా ఓడ
గట్టు జేర్ప మన తరమా (ఆ)

3. రాజ కుమారుడు వీడు నవ
రత్న సొమ్ములు పెట్టినాడు (ఆ)

4. పసి బిడ్డ కాదటవమ్మా వీడు
భయపడునో తెలియదమ్మా (ఆ)

5. తల్లితో చాడి పలుకుదురే మన
తలలు వంచ దూరుదురే (ఆ)

6. మాటకు చోటౌను కాని మన
ఆటలు తెలియక పోని (ఆ)

7. యువతులారా మీలోనే మీరు
యోచింప ప్రొద్దు పొయ్యెను (ఆ)

8. చాలు చాలిటు రారమ్మా ఓడ
సలిలమందు తోయరమ్మా (ఆ)

9. త్యాగరాజాప్తుడు వీడు
వనితల మాటలు విన లేడు (ఆ)

Popular posts from this blog

భో శంభో శివ శంభో స్వయంభో

మంగళం జయ మంగళం.. మా నల్లనయ్యకు మంగళం

రామరామరామ యన్న రామచిలుక ధన్యము